
మాజీ మంత్రి హరీశ్‌రావు.
* మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బతుకమ్మ పండగ కేవలం తెలంగాణకే ప్రత్యేకమైన పండగ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమెత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో ఉద్యమానికి మరింత ఊపు నిచ్చింది బతుకమ్మే అని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మకు ఉద్యమకాలంలోనే గుర్తింపు వచ్చిందన్నారు. ఉద్యమ శక్తిని చాటేందుకు మహిళలు రోడ్లపై బతుకమ్మలు ఆడారని హరీష్ రావు గుర్తు చేశారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మని రాష్ట్ర పండుగగా జరుపుకున్నామన్నారు. ప్రపంచంలో తెలంగాణ వాళ్లు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మను గొప్పగా జరుపుకుంటారని తెలిపారు.ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
………………………………………………