
*సాధారణ ప్రయాణికులతో ముచ్చట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీగా ఉండి హైదరాబాద్ నగర సీపీగా బదిలీ అయిన
వీసీ సజ్జనార్ ఆర్టీపీ ఎండీ హోదాలో చివరి రోజున సాధారణ ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బస్ భవన్ కార్యాలయం వరకు సజ్జనార్ బస్ లో ప్రయాణించారు. యూపీఐ చెల్లింపు ద్వారా కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సాధారణ ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.మహాలక్ష్మి పథకం అమలు తీరును మహాలక్ష్మి పథకం పట్ల మహిళల స్పందన ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
…………………………………………