
* డయల్ 100కు సమాచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని డయల్ 100కు ఫోన్ వచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల కోసం దర్యాప్తు చేయగా మానసిక ఒత్తిడితోనే అతడు చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం షాపూర్‌నగర్ ఎల్బీనగర్కు చెందిన యుగందుల నవమోహన్ కుమారుడు చరణ్‌దీప్ (24) ఈనెల 27న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఈనెల 28వ తేదీన ఉదయం 7 గంటలకు హెచ్ఎంటీ అటవీ ప్రాంతోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన విషయం పోలీసులకు 100 డయల్ ద్వారా పోలీసులకు తెలిపింది. వెంటనే మృతి చెందిన సంఘటనకు స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద దొరికిన సమాచారంతో కుటుంబ సభ్యులకు తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో తమ కుమారుడిది సున్నితమైన మనస్తత్వమని, మానసిక ఒత్తిడితోనే ఉరేసుకుని మరణించి ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………………..