
* విద్యుదాఘాతంతో ముగ్గురికి గాయాలు
* హైటెన్షన్ వైర్లకు తాకిన బతుకమ్మకున్న ఇనుపరాడ్డు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గణేశ్ విగ్రహాల తరలింపులో విద్యుదాఘాతానికి గురై జరిగిన ఘటనలు మరువక ముందే.. బతుకమ్మ వేడుకల్లోనూ అపశ్రుతి చోటుచేసుకుంది. ఎత్తయిన బతుకమ్మను నిమజ్జనానికి తరలిస్తుండగా, దానికి ఉన్న ఇనుము హైటెన్షన్ వైర్లకు తాకి ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి సద్దుల బతుకమ్మ రోజు ఎత్తయిన బతుకమ్మలను తయారు చేస్తారు. వాటిని ట్రాలీలో పెట్టి బతుకమ్మలు ఆడిన అనంతరం రంగదాముని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈఏడాది కూడా నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్ నుంచి నల్లచెరువు వైపు అతిపెద్ద బతుకమ్మ ట్రాలీలో తీసుకువెళ్తున్నారు. బతుకమ్మ చుట్టు ఇనుప రాడ్డు ఉండటంతో హైటెన్స్న్ వైరు తగలడంతో ట్రాలీలో ఉన్న ముగ్గురికి చేతులకు శరీరానికి పలుచోట్ల గాయాలైనాయి. స్థానికులు వెంటనే వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
………………………………………….