
ఆకేరు న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ప్రభుత్వం హైదరాబాద్ నగర కమిషనర్ గా బదిలీ చేసింది. హైదరాబాద్ నగర కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ హూంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీవీ ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ను ఉద్యోగులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, సీటీఎం (కమర్షియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్ఎంలు, డీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. వీడ్కోలు అనంతరం సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలోనూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ‘నా స్టాప్ వచ్చేసింది. ఆర్టీసీకి 4 సంవత్సరాలకు పైగా మార్గదర్శకత్వం వహించిన తర్వాత, ఈ బస్సు నుంచి దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకే సాగుతుంది. బస్సును పార్ చేసి, తదుపరి సవాలు వైపు ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం ఇది’ అని పేర్కొన్నారు.
………………………………………..