
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా కొత్తపల్లి సుశీల్ వంశీ
విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. విధుల్లో చేరిన కొత్తపల్లి కుశీల్ వంశీని జిల్లా కలెక్టర్ అభినందిస్తూ, ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం తల్లి, తండ్రి బంధు మిత్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేడర్లో డిప్యూటీ కలెక్టర్గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని బాధ్యతలను సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సాహించిన తల్లితండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
………………………………………..