
* పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని వెంకటాపూర్ మండల కార్యకర్తలకు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క దిశ నిర్దేశం చేశారు. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రా మాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా రు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతు న్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్య త నాయకులు, కార్యకర్తలదేనన్నారు.రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని,పిలుపునిచ్చారు .పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………..