
– ఈటెల అనుచరుడి సతీమనే జడ్పిటిసి అభ్యర్థి ?
– మండల బిజెపిలో లుకలుకలు ముగిసినట్టేనా ?
ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో జడ్పిటిసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో కమలాపూర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఈ క్రమంలోనే బిజెపి పార్టీ నుంచి జెడ్పిటిసి అభ్యర్థిగా పంగిడిపల్లి గ్రామానికి చెందిన వలిగే సాంబారావు సతీమణి లక్ష్మి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది.ఈ మేరకు వలిగే సాంబారావు మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ తో శనివారం ఉదయం కరీంనగర్లో కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను కలిశారు. వలిగే లక్ష్మి జెడ్పిటీసీ అభ్యర్థిత్వం పట్ల ఎంపీ బండి సంజయ్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.ఎంపీ ఈటల రాజేందర్ అనుచరుడు వలిగే సాంబారావు సతీమణి లక్ష్మి కి బిజెపి జెడ్పిటిసి అభ్యర్థిగా ఎంపిక అయితే మండల బిీజేపీలో అంతర్గత సమస్యల పరిష్కారానికి బండి సంజయ్ నిర్ణయం తోడ్పడనుంది. మండలంలో పార్టీ నీ సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో అందరు కలిసి పార్టీ అభివృద్ధికై కృషి చేెసి, విజయాలు సొంతం చేసుకోవాలని మంత్రి బండి సంజయ్ ఆదేశించినట్టు సమాచారం.కాగా మాజీ జడ్పిటిసి వలిగే సాంబారావు సర్పంచ్ గా, జడ్పిటిసిగా 24 ఏండ్లుగా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి బిీజేపీ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి ఎంపిక రేసులో ఉన్నారు.
………………………………………..