
* గుండెపోటుతో తెలంగాణ యువకుడు మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కుప్పకూలుతున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన తెలంగాణ యువకుడు హార్ట్ అటాక్ తో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడే పీజీ పూర్తి చేసిన మహేందర్ రెడ్డికి ఉద్యోగం కూడా వచ్చింది. వర్క్ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే పెను విషాదం వారిని ముంచేసింది. అక్టోబర్ 3న గుండెపోటుతో మహేందర్ రెడ్డి మరణించాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషించేలోపే ఇలా మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
…………………………………………………