* తెలంగాణ రైతుంటే ఆ పార్టీలకు చిన్నచూపు
* రాష్ట్రానికి బీఆర్ ఎస్సే శ్రీరామ రక్ష
* మాజీ మంత్ర హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, జహీరాబాద్ : కాంగ్రెస్.. బీజేపీ లు తెలంగాణ పాలిట శకునిలు అని, ఆ రెండు పార్టీలూ తెలంగాణకు శత్రువులే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణ రైతులంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణానే తన ప్రాణంగా కేసీఆర్ (KCR) భావించారని, రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంపై కూడా ఈ సందర్భంగా విమర్శలు చేశారు. బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా అని, 8 మంది ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని అన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?. అని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) పార్టీ శ్రీరామరక్ష అన్నారు.
…………………………………………
