*స్థానిక ఎన్నికల్లోమ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ఆకేరు న్యూస్, ములుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని,అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరూ నిస్వార్ధంగా పని చేయాలని తాడ్వాయి మండలంలోని, బీరెల్లీ , నర్సాపూర్ , కాటాపూర్ ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాల్లో తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి సీతక్క ములుగు జిల్లా కు వందల కోట్ల రూపాయలు నిధులు పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు , రహదారులు , శాశ్వత పరిష్కారం బ్రిడ్జి నిర్మాణాలను , పేదల కళ్ళలో ఆనందం చూసేందుకు ఇందిరమ్మ ఇళ్లు , మంజూరు.దీనికి ప్రధాన కారణం మనకు మంత్రి అండగా ఉన్నందున మన గ్రామాలలో క్లస్టర్ పరిధిలోని ఎంపీటీసీలు , సర్పంచులు మన నాయకులు ఉన్నట్లయితే గ్రామాలను మరింత అభివృద్ది సాధించొచ్చు అని అన్నారు.కష్ట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశాం, ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో కష్ట పడ్డ ప్రతీ ఒక్క నాయకుడు , కార్యకర్త వారి కష్టాన్ని గుర్తించి భవిష్యత్తులో కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా అధిష్టానం కృషి చేస్తుందని దిమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీకీ కార్యకర్తలే గొప్ప బలం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మాజీ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి , మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్ రావు , బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండీ ముజఫర్ , సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య , మాజీ సర్పంచులు మంకిడీ నరసింహ స్వామీ , బెజ్జురి శ్రీనివాస్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి సతీష్ కుమార్ , సీనియర్ నాయకులు ముద్ర కోల తిరుపతి , పులి నర్సయ్య గౌడ్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి , సింగిల్ విండో డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు , రెడ్డి , ఇర్సవడ్ల నారాయణ , బండారి చంద్రయ్య , ముండ్రాతి రాజశ్రీ , మంకిడి నర్సయ్య , లింగా చారీ , ఇర్ప సూర్య నారాయణ , యువజన నాయకులు మర్రి నరేష్ , గంట సాయి రెడ్డి , పుల్లురి నాగార్జున , గ్రామ కమిటీ అధ్యక్షులు , సీనియర్ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
