* ఏఐటియుసి పిలుపు
ఆకేరు న్యూస్, ములుగు:ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్మికుల సత్తా చాటాలని ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రము లో బండి నర్సయ్య అధ్యక్షతనజరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన జంపాల రవీందర్ మాట్లాడుతూ, పాలకుల మోసాలను కార్మికులు గ్రహించి, గుణపాఠం చెప్పాలంటే సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ,అందులో భాగంగా ప్రస్తుతం జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్మిక వర్గం సత్తా చాటాలని పిలుపునిచ్చారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే స్పందించి వంట కార్మికులకు కనీస వేతనాలు రూ 10 వేలు చెల్లించాలని,, స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యలరైజ్ చేయాలని డిమాండ్ చేశారు, హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని,,భవణ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటు పరంచేసారు, వెంటనే ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికులు అందరికీ, కనీస వేతనాలు రూ 26000/- లు చెల్లించాలని డిమాండ్ చేశారు, స్కావెంజర్స్ వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో కొక్కుల రాజేందర్,గాలి సమ్మయ్య,తోట సంపత్, గుర్రం రమేష్, జనగాం శోభ, సారయ్య, నవీన్, మధుకర్, సమ్మయ్య, పోషాలు,సామల దేవేందర్, వేణు,చిన్న మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….
