డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్తేషన్లు కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలైన నేపధ్యంలో డీప్యూటీ సీఎం స్పందించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలను బలంగా విన్పిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని తమకు నమ్మకం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చన్నారు. సిపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు.రిజర్వేషన్ల పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపధ్యంలో భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. ఆయన తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఉన్నారు. సుప్రీంలో వాదనలు జరిగే సందర్భంలో ముగ్గురు మంత్రులు హాజరుకానున్నారు.
…………………………………….
