* కన్న తల్లి గొంతు కోసి చంపేశాడు
* శవాన్ని పక్కన పెట్టుకొని టీవీలో పాటలు చూస్తూ…
ఆకేరు న్యూస్, అమరావతి : మానవ సంబంధాలకు అర్థం లేకుండా పోతోంది. కన్న కొడుకుల చేతిలో తల్లి దండ్రులకు రక్షణ కరువైన అతి దారుణమైన రోజులివి. ఖర్చులకు డబ్బులివ్వలేదని కన్న కొడుకు తల్లిని కత్తితో పీక కోసి చంపేశాడు. ఈ సంఘఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వైస్సార్ కడప జిల్లాలో జరిగింది. పొద్దుటూరులోని శ్రీరామ్ నగర్‌కు చెందిన ముచ్చుగుంట్ల విజయ భాస్కర్ రెడ్డి , లక్ష్మీ దేవి దంపతుల కుమారుడు ముచ్చుగుంట్ల యశ్వంత్ రెడ్డి చైన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమాల్లో కూడా అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతీ నెల ఖర్చుల కోసం తల్లీ యశ్వంత్ రెడ్డి కోసం డబ్బులు పంపించేది. ఇటీవల రూ. 3 వేలు పంపించమనడంతో తల్లీ పంపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో పదివేల రూపాయలు కావాలనడంతో తల్లీ పంపించ లేక పోయింది. దీంతో కోపం పెంచుకున్న కొడుకు హైదరాబాద్ నుంచి నేరుగా పొద్దుటూర్ చేరుకున్నాడు. తల్లితో ఘర్షణకు దిగడంతో తండ్రి అడ్డు వచ్చాడు. తండ్రిని బలవంతంగా బాత్ రూమ్‌లో వేసి తలుపు పెట్టాడు. కూరగాయల కత్తితో తల్లి గొంతుకోసాడు. రక్త ప్రవాహంలో విలవిల్లాడుతుంటే హాయిగా టీవీలో పాటలు వింటూ కూర్చున్నాడు. తల్లి అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడుకు చేరుకుని తలుపు తీయమంటే కొడుకు ఎంతకూ తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ తిమ్మారెడ్డి అధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ ఇతర పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొడుకు ఎంతకూ తలుపు తీయక పోవడంతో పోలీసులు బలవంతంగా తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి శవం పక్కనే హాయిగా టీవీలో పాటలు వింటున్న కొడుకును చూసి పోలీసులు నిర్ఘాంత పోయారు. బాత్ రూం నుంచి తండ్రి కేకలు వినబడడంతో పోలీసులు గడియ తీయడంతో బయటకు వచ్చి భార్య శవం పక్కన కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించాడు . కాగా యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
———————————-
