ఆకేరు న్యూస్ , డెస్క్ : సుప్రీం కోర్టులో అవమానకర సంఘటన చోటుచేసుకున్నది. భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ గవాయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించిన సంఘటన జరిగింది. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ ఒక న్యాయవాది నినాదాలు చేస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆయనను తోటి న్యాయవాదులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కలకలం రేపిన ఈ సంఘటనపై సీజేఐ గవాయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
————————-
