* హైకోర్టులో కూడా చిత్తశుద్దితో పోరాడతాం
* రిజర్వేషన్లపై జీవో కూడా విడుదల చేశాం
* ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందన
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ : ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును డిస్మిస్ చేసినందుకు సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (BATTI VIKRAMARKA) అన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హైకోర్టులో కూడా ఇదే వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు. స్థానిక ఎన్నికలు కూడా ఇవే రిజర్వేషన్ల ప్రాతిపదికన జరుగుతాయన్నారు. ఆ నిర్ణయంపై పట్టుబడి ఉన్నామని, దానిపై నిలబడతామని తెలిపారు. రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశామన్నారు. దేశంలో తాము చేసిన తరహాలో సర్వే ఎక్కడా జరగలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలా చేయలేదని అన్నారు. కాగా, అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో అడ్డుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABHAKAR) విమర్శించారు.
…………………………………………
