* పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
* సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం
ఆకేరున్యూస్ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం ఇచ్చే అంతిమతీర్పు బీసీలకు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని తెలిపారు. 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
…………………………………….
