* నవంబర్ 11 న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
*షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీహార్ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది.బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ఈ నేపధ్యంలో నవంబర్ 22 లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ లోమ రెండ దశల పోలింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్విడుదల చేసింది. నవంబర్ 14న కౌంటింగ్ మొదలవుతుంది. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పది లసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు దశల్లో జరుగనున్న బీహార్ పోలింగ్ లో మొదటి దశలో 121 స్థానాలకు రెండో దశలో 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పది స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలకు ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్ పరిశీలన నామినేషన్ల ఉపసంహరణుకు 24 తేదీ గడువు . ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి కాగా బిహార్ మొదటి దశ పోలింగ్ కు నామినేషన్లను అక్టోబర్ 17 నుంచి స్వీకరిస్తారు 20 న ఉపసంహరణకు గడువు పోలింగ్ నవంబర్ 6న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 14న ఉంటుంది. రెండో దశలో 122 స్థానాలకు నామినేషన్ల తుది గడువు అక్టోబర్ 20. 21న నామినేషన్లను పరిశీలిస్తారు అక్టోబర్ 23 వరకు నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ 14న ఓట్ల లెక్కింపు
జూబ్లీ హిల్స్ ఎన్నిక నవంబర్ 11న
బీహార్ అసెంబ్లీ షెడ్యూల్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీ హిల్ష్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది. నవంబర్ 14న జిబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడతాయి.ఈ నెల 13న జూబ్లీహిల్ష్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునితకు బీఆర్ ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
………………………………………….
