* అవకాశం కల్పించాలని హైకోర్టుకు తీన్మార్ మల్లన్న
* పరిశీలించాలని ఎస్ఈసీకి కోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TELANGANA RAJYADHIKAARA PARTY)ని స్థాపించిన తీన్మార్ మల్లన్న (TEENMAR MALLANNA)స్థానిక సంస్థల ఎన్నికల నుంచే తన హవా చాటాలని ప్రయత్నిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీస ప్రభావం చూపిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని హైకోర్టులో పిటిషనర్ వేశారు. రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తులను పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు (HIGH COURT) ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా, సెప్టెంబర్ 17న తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ని నవీన్ ప్రకటించారు. జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండాపై భాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను రాశారు. పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును ముద్రించారు.
……………………………………………………….
