
* రేసు నుంచి తప్పుకున్న బొంతురామ్మోహన్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజార్టీ శ్రేణులు నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమండ్ ఆదేశాల మేరకు పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు. నేడో రేపో నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
…………………………………………….