
* పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన
* ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీజీఎస్ ఆర్టీసీ పెంచిన బస్ చార్జీలకు నిరసనగా బీఆర్ ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఈ నెల తొమ్మిదిన బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బస్ భవన్ చేరుకొని ఆర్టీసీ ఎండికి బీఆర్ ఎస్ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నట్లు బీఆర్ ఎస్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ ఎస్ నాయకులు బస్ భవన్ చేరుకొని ఆర్టీసీ ఎండికి పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వనున్నారు. నందినగర్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీష్ రావు, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుంచి పద్మారావు గౌడ్, దిల్సుఖ్నగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ గౌడ్, కూకట్పల్లి నుంచి కృష్ణారావు నుంచి బస్ భవన్కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.
…………………………………