
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ఏ.టి.సి నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ఏటూరు నాగారం, వాజేడు మండలాలలోని, ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ (RITI), ఎ.టి.సి (ATC) కేంద్రాలను సందర్శించారు .కలెక్టర్ క్యాంపస్లను పరిశీలించి, సిబ్బంది, శిక్షణార్థులతో మాట్లాడి, శిక్షణా కార్యక్రమాల పురోగతి, సదుపాయాలు, ATC పనుల స్థితిని సమీక్షించారు. ATC కోసం వచ్చిన మెషినరీ, ఫర్నిచర్, కంప్లీట్ కావలసిన పెండింగ్ పనులు, రిక్రూట్మెంట్ అయిన ట్రైనర్స్ గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు అన్నివసతులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ నాణ్యత, వృత్తి విద్యా సదుపాయాల విస్తరణ, విద్యార్థుల ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణా విధానాలను నవీకరించాలని అధికారులను ఇన్స్ట్రక్టర్లను సూచించారు. ప్రస్తుత ఏ.టి.సి సెంటర్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణ చాలా ప్రాముఖ్యమైందని అన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా పిల్లలు బాగా చదువుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ప్రిన్సిపాల్ ఎస్.జగన్మోహన్ రెడ్డి, వాజేడు ప్రిన్సిపాల్ శేఖర్, ఎం పి డి ఓ లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, ఇన్స్ట్రక్టర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………..