
* హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* హైటెక్స్ లో ప్రాపర్టీ షో ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో రియల్ రంగం పడిపోయిందని ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎకరా 117 కోట్లు పలికిందని, రియల్ వృద్దికి ఇదే నిదర్శనం అని గుర్తు చేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో నరెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నరెడ్కో బ్రోచర ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం చేసే బాధ్యత నరెడ్కోపై ఉందని అన్నారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ది చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రతీ సంవత్సరం పది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి ప్రత్యేకతలు అందరికీ తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మర్యాదలకు ఎవరైనా సంతోషం వ్యక్తం చేశారని, పర్యాటకులకు కావాల్సిన సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మూసీ నదిని గాంధీ సరోవర్ గా తీర్చిదిద్దుతామని హామీ నిచ్చారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. హైడ్రా వల్ల ఎలాంటి నష్టం లేదని, చెరువుల, నాలాల పరిరక్షణకు పాటుపడుతోందని అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని దుష్ప్రచారం చేశారని, అభివృద్ది చెందిందని చెప్పడానికి ఇటీవల జరిగిన వేలమే నిదర్శనమన్నారు. ఎకరా 117 కోట్లకు అమ్ముడుపోయింని గుర్తు చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రాక ముందు బిల్డర్ గా పనిచేశానని, ఇక్కడకు వస్తే తన సొంతింటికి వచ్చినట్లు ఉందని వెల్లడించారు. కాగా, ప్రాపర్టీ షో మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రాపర్టీ షోలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. విల్లాలు, అపార్ట్మెంట్ల వివరాలు తెలిసే ఏర్పాట్లు చేశారు.
……………………………………………..