
* రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు
* రాహుల్, మోదీలు తలచుకుంటే బీసీలకు రిజర్వేషన్లు పెరగవా..?
* మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పై ప్రజలకు నమ్మకం లేదని బీఆర్ ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు.రేవంత్ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని కానీ ప్రజల నమ్మకాన్ని రేవంత్ వమ్ము చేశాడని అన్నారు. కోర్టు తీర్పు ద్వారా ఇందిరాగాంధీ పదవికి ముప్పు ఏర్పడ్డప్పుడు రాజ్యాంగాన్నే సవరించారని వినోద్ గుర్తు చేశారు.
స్థానిక ఎన్నికల్లో బీసీ ల రిజర్వేషన్ల పెంపు కుదరదని కృష్ణమూర్తి కేసులో సుప్రీం తీర్పు వచ్చిందని వినోద్ అన్నారు. ప్రధాని మోదీ ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీలు తలుచుకుంటే బిసి రిజర్వేషన్ బిల్లు పార్టమెంట్ లో పాస్ కాదా అని వినోద్ ప్రశ్నించారు.వోడాఫోన్ 40 వేల కోట్ల రూపాయల మేర ఇన్కమ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింన్నారు. వోడాఫోన్ కు లబ్ది చేకూర్చిన బీజేపీ బీసీ ల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు అని వినోద్ ప్రశ్నించారు.ఎన్నో సార్లు తమకు అనుకూలంగా ఉన్న విషయాలపై రాజ్యాంగాన్ని సవరించిన బీజేపీ బీసీ ల కోసం ఎందుకు సవరించదు అని అన్నారు.బీసీ కుల గణన పై కూడా సుప్రీం తీర్పు ను దాటవేసేలా పార్లమెంటులో బీజేపీ చట్ట సవరణ తెచ్చిందన్నారు.రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చితే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరుగవు అని వినోద్ అన్నారు. ఇప్పటికైనా ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ లు కలిసి తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ ,లీగల్ సెల్ ప్రతినిధి సి .కళ్యాణ్ రావు పాల్గొన్నారు
………………………………………..