ఆకేరు న్యూస్, కమలాపూర్ : ట్రాక్టర్ బైక్ ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ ఎల్లమ్మ గుడి ఆర్చ్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం మండలంలోనీ ఉప్పల్ గ్రామ ఎల్లమ్మ గుడి నుండి గుడెల్లి అంజి(33) తన ఇంటికి పల్సర్ 220 బైక్ పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గుండెబోయిన రాజేశం సిమెంటు బస్తా లోడుతో దేశరాజుపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గుడి ఆర్చ్ వద్ద ట్రాక్టర్ బైకును బలంగా ఢీకొందని సీఐ తెలిపారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని గ్రామస్థులు వెంటనే 108 అంబులెన్స్‌లో MGM ఆసుపత్రికి వరంగల్‌కు తరలించే క్రమంలో, మార్గమధ్యంలో మృతి చెందాడనీి సీఐ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ రాజేశం పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.కాగా మృతుడికి భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
…………………………………………..
