
* పొంగులేటిపై రేవంత్ కు ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
* మేడారం టెండర్ల విషయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపణ
ఆకేరున్యూస్ హైదరాబాద్ : తమ శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
గత కొద్ది రోజులుగా జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కొండా సురేఖకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే , ఈ నేపధ్యంలో . మేడారం టెండర్లలో ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి , పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి పనులకు చెందిన టెండర్ల విషయంలో మంత్రులిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఇన్ చార్జి మంత్రిగా పొంగులేటి మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేయడంతో మంత్రి పొంగులేటి మేడారంలో అభివృద్ధి పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో టెండర్ల విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది.
……………………………………………