
* మంచు విష్ణుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై “మా” అధ్యక్షుడు మంచు విష్ణుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంటక్ (MLC BALMURI VENKAT) ఫిర్యాదు చేశారు. గాంధీజీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ “మా” సభ్యత్వాన్ని రద్దు చేయాలని విష్ణును వెంకట్ కోరారు. పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ చరిత్రను వక్రీకరించారని అన్నారు. గాంధీ సిద్దాంతాలను నమ్మే వారి మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్(SRIKANTH AYYAMGAR) పై మా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సినీ పెద్దలు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించాలని తెలిపారు. ఆయనపై ఎటువంటి చర్యలు చేపట్టారో మా నిర్ణయాన్ని త్వరగా తెలయజేయాలని మంచు విష్ణు (MANCHI VISHNU) సూచించారు. మా అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి ఈమేరకు వెంకట్ ఫిర్యాదు చేశారు.
……………………………………..