
* జైలు అధికారులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
* జనగామ డీసీపీకి బాధితుల ఫిర్యాదు
ఆకేరు న్యూస్, జనగామ: జనగామ సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న ఖైదీ మృతి చెందాడు. సింగరాజు పల్లికి చెందిన మల్లయ్య అనే ఖైదీ స్నేహితులతో కోట్లాడిన కేసులో జనగామ సబ్ జైలులో రిమాండ్ గా ఉన్నాడు. మల్లయ్య బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్లలో కలుపుకొని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా జైలు అధికారులు మల్లయ్యను వెంటనే వరంగల్ ఓని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా మల్లయ్య ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లయ్య మృతికి జైలు అధికారులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యుల మీద చర్య తీసుకోవాలంటూ జనగామ డీసీపీకి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
……………………………………….