
* సమస్యలు ఉంటే సీఎం వద్ద మాట్లాడుకుందాం
* వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సమసిపోయిన సయస్యను మంత్రి వివేక్ మళ్లీ ప్రస్తావించడం బాధాకరంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు నిజామాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాలల ఐక్య సదస్సులో ఆదివారం మాట్లాడిన తీరు పై మంత్రి అడ్లూరి స్పందించారు. మాలల ఐక్య పదస్సు సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ మంత్రి అడ్లూరిని కొంతమంది వ్యవక్తులు రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను అపార్థం చేసుకున్నారని జూబ్లీ హిల్స్ లో సమావేశం జరిగినప్పుటు లక్ష్మన్ వచ్చిన సమయంలో తాను వెళ్లిపోతున్నాను అని అనటం అబద్దం అన్నారు. కొంత మంది కావాలనే లక్ష్మణ్ ను రెచ్చగొట్టారని ఆరోపించారు.లక్ష్మణ్‌ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామేనని వివేక్ గుర్తు చేశారు. తనకు ఎవరితో విఢేదాలు లేవని అందరినీ కులుపుకుపోయి పనిచేస్తానని అన్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమసిన వివాదం గురించి ప్రస్తావించడం సరికాదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటేసీఎం రేవంత్ రెడ్డి వద్ద మాట్లాడుకోవాలని సూచించారు. పబ్లిక్ మాట్లాడడం సరికాదన్నారు. ఏఐసీసీ పెద్దల గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడకూడదు అన్నారు. వివేక్ మాటలు వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నానని అడ్లూరి అన్నారు.
……………………………………