
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రం లో ని క్యాంప్ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 63 లక్షల విలువ గల చెక్కులను ములుగు నియోజక వర్గం లోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వములో ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స పొంది ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఏడాదిన్నర పట్టేదని లక్ష ఖర్చు అవుతే కనీసం 20 వేలు కూడా వచ్చేవి కాదన్నారు.ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఏర్పాడిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనే లక్ష్యం తో మన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు ఖర్చు అవుతే 40 వేలకు తగ్గకుండా వెంటనే నిధులు మంజూరు చేస్తూ పేదల కోసం ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………….