
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాల ప్రకారం మండలంలోని బోటిలింగాల గ్రామానికి చెందిన ఊకే సారయ్య,(25)ఆగబోయిన మల్లేష్(30)లు వ్యక్తిగత పని మీద గోవిందరావుపేట మండలం పసర గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.పసర చేరుకొని వ్యక్తిగత పనులు పూర్తి అయిన వెంటనే తిరుగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పిల్లర్ కు ఢీకొట్టీ కింద పడిపోయారు. బలమైన గాయం తగలడంతో ఊకే సారయ్య అను యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లేష్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. మల్లేష్ ను 108 ద్వారా మెరుగైన వైద్య సేవల కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
…………………………………………………….