
* కెవిపిఎస్ జిల్లా కమిటీ కార్యదర్శి రత్నం
ఆకేరు న్యూస్, ములుగు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ జస్టిస్ గవాయి పై దాడి హేయమైన చర్య అని కెవిపిఎస్ జిల్లా కమిటీ కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం రత్నం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతు ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఇలాంటి సంఘటనలు జరగడం సహించరానిదని అన్నారు.ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ జస్టిస్ పై దాడి భారత రాజ్యాంగంపై ప్రజాస్వామ్యం పై దాడిగా భావించడం జరుగుతున్నదన్నారు. దళితుడు అయినందన ఇటువంటి దాడులు చేస్తున్నారని ఇది బ్రాహ్మణియ వ్యవస్థ కుట్ర అని ఆరోపించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….