
* బూతులు మాట్లాడే ముఖ్యమంత్రిని ఇంత వరకు చూడలేదు
*కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి లేడు
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* జాబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బూతులు మాట్లాడే ముఖ్యమంత్రిని ఇంత వరకు చూడలేదని సీఎం కేసీఆర్ దివాళాకోరు ముఖ్యమంత్రి అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల మందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ పూర్తి చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని కేటీఆర్ అన్నారు. వృద్ధులకు 4 వేలు ఇస్తామన్నారు. మహిళలకు 2 వేల 5వందలు ఇస్తామన్నిరు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కానీ ఏ ఒక్కటీ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్గోజర్లతో మీ ఇండ్లు కూలగొడుతుందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయరని దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కు అండగా ఉంటారని అందుకే గత ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం బీఆర్ ఎస్ కే ఓటేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని కేటీఆర్ అన్నారు. మాగంటి గోపీనాధ్ మరణంతో అనుకోకుండా వచ్చిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ మాగంటి కుటుంబానికి అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఉప ఎన్నికల్లో మాగంటి సతీమణి సునితను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడరి కేటీఆర్ అన్నారు. అజహరొద్దిన్ కు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ని చేశారని ఆ ఎమ్మెల్సీ పదవి చట్ట ప్రకారం నిలువదని కాంగ్రెస్ పార్టీ అజహర్ ను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. నెల రోజుల పాటు కష్టపడి పనిచేసి బీఆర్ ఎస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
…………………………………………….