
* తప్పిన పెను ప్రమాదం
ఆకేరు న్యూస్ సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఓ పెను ప్రమాదం తప్పింది చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ మునగాల మండలం నేలమర్రి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు చెట్టును ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. మరో వాహనం ఎదురు కావడంతో డ్రైవర్ అదుపు తప్పాడు. ప్రమాదం జరిగిన్పుడు బస్ లో 15 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ బస్ కు ఫిట్ నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పిల్లలు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సహాయంతో బస్ ను బయటకు తీశారు.
………………………………..