
* కొండా సురేఖ.. సీతక్కలపై పొంగులేటి కామెంట్
* మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష
ఆకేరున్యూస్ ములుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు
కొండా సురేఖ, సీతక్కలు సమ్మక్క సారక్కల్లాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. సోమవారం ఆయన
సమ్మక్క సారక్క జాతర కోసం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సహచర మంత్రులు తనపై ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదన్నారు. అయినా తన మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుందని చెప్పుకొచ్చారు. 70 కోట్ల టెండర్ల కోసం తాపత్రయపడే అవసరం తనకు లేదన్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి కలుగజేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి శనివారం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని మంత్రి పీఆర్ వో మీడియాకు ఒక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో పొంగులేటి పై విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని మంత్రి తెలిపారు. అవసరమైతే నిధులను పెంచే అవకాశం ఉందన్నారు కేవలం ఆలయ ప్రాంగణం కోసమే రూ. 101 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
……………………………………….