
* సెలూన్ లో సందడి చేసిన మల్లారెడ్డి
* యువకుడికి పర్ ఫెక్ట్‌గా కటింగ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఎన్నికల వేళ రాజకీయ నాయకులు లీలలు రకరకాలుగా ఉంటాయి
ప్రచారంలో భాగంగా ప్రజలను అట్రాక్ట్ చేయడానికి వారు వింత వింత అవతారాలు ఎత్తుతుంటారు. రోడ్డు మీద చాయ్ అమ్ముతూ.. పండ్ల దుకాణాల్లో పండ్లు అమ్ముతూ.. మటన్ షాఫులో మటన్ కొడుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక పోతే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉండడమే కాకుండా పక్కనున్న వాళ్లు సరదాగా నవ్వుకునేలా ఉంటుంది. ఎల్లప్పుడూ హ్యాపీగా జాలీగా కన్పించే మల్లారెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సెలూన్ లోకి ప్రవేశించి ఓ యువకుడికి కటింగ్ చేశారు. మల్లారెడ్డి ఎంతో అనుభవం ఉన్న వాడిలా కటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
…………………………………….