
* వచ్చే ఐదేళ్లలో రూ.80 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
* విశాఖలో భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
* ఢిల్లీ వేదికగా అగ్రిమెంట్
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ (GOOGLE) నిర్వహించిన కార్యక్రమం ఇందుకు వేదికగా మారింది. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.80 వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు (CM CHANDRABABU NAIDU) మాట్లాడుతూ.. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టబోతోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూస్తున్నారని అన్నారు. గూగుల్ సంస్థకే అన్ని సంస్థలకూ సంపూర్ణ సహకారం అందిస్తామని, విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. గతంలో మైక్రో సాఫ్ట్ ను హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. హార్డ్ వర్క్ కాదు.. సాఫ్ట్ వర్క్ చేయాలని నిపుణులకు సూచించారు.
…………………………………………