
* ప్రధాని మోదీ, సీఎం నయాబ్ సింగ్ సైనీ స్పందించాలి
* పూరన్ కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించిన రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్ డెస్క్ : ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ పై ప్లాన్ ప్రకారం వివక్ష చూపారని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). పూరన్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
అక్టోబర్ 7వ తేదీన పూరన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేసధ్యంలో రాహుల్ గాంధీ పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పూరన్ కుమార్ ఆత్మహత్యపై ప్రధాని మోదీ సీఎం నయాబ్ సింగ్ సైనీ స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు.పూరన్ కుమార్ మరణం ఓ కుటుంబానికి చెందిన అంశం కాదు అని, ఇది దళితుల అంశమని రాహుల్ అన్నారు. మూడు రోజులు గడిచినా బాధ్యులపై ఎటువంటి చర్యతీసుకోకపోవడం అన్యాయమన్నారు.పూరన్య కుమార్ కుమార్తెలు ఉద్దరు తీవ్ర విషాదంలో ఉన్నారని వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
…………………………………….