
* సిడిపిఓ మల్లీశ్వరి
ఆకేరు న్యూస్, ములుగు: పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సిడిపిఓ మల్లేశ్వరి సూచించారు.
తాడ్వాయి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల అంగన్వాడి కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో పోషణ మాసం కార్యక్రమం పై అవగాహన సమావేశం నిర్వహించారు. దీనిని పురస్కరించుకొని సీడీపీఓ మల్లేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక వ్యక్తి కి పౌష్టిక ఆహారం తో ఆరోగ్యవంతమైన జీవితం లభింస్తుందన్నారు.ప్రతి ఒక్కరు నిత్యం ఆహార అలవాట్లు లో పౌష్టికాహారం సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమాచారం ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే సమాజానికి మేలు చేసిన వారు అవుతారని అన్నారు .పోషక ఆహారం అనేది మహిళలు,పిల్లలు,ఆడ, మగ బేధం లేకుండా అందరు గ్రామాలలో దొరికే కూరగాయలు, ఆకు కూరలు, చిరుదన్యాలు, తృణధాన్యాలు, పాలు, పండ్లు, సాయానికి తింటే ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండటం వలన ఆరోగ్యావంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి చైతన్యవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మల్లేశ్వరి తో పాటు సూపర్వైజర్ విజయ, సుమతి, శారదా, అరుణ, భాగ్య లక్ష్మి, బ్లాక్ కోఆర్డీనేటర్ శ్రావణి, యూడీసీ రఘువిర్, జూనియర్ అసిస్టెంట్ శిరీష, ఎన్ జి ఓ అనిల్ కుమార్, తో పాటు తాడ్వాయి, గోవింధరావుపేట మండలాల ఆంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………..