
ఆకేరున్యూస్, హనుమకొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేడు హనుమకొండకు రానున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి ఇటీవలే మాతృ వియోగం జరిగింది. ఈ సందర్భంగా వడ్డెపల్లిలోని పీజీఆర్ గార్డెన్స్‌లో దొంతి మాధవ రెడ్డి నిర్వహిస్తున్న మాతృయజ్ఞం కార్యక్రమానికి హాజరవుతారు. మద్యాహ్నం 1.15 నిమిషాలకు పీజీఆర్ గార్డెన్స్‌కు చేరుకుని 1.45.నిమిషాల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళతారు. జిల్లాలో ఎలాంటి అధికార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు.
………………………………….