
* హాస్టల్ యువకుల వీరంగం
* ఇంట్లోకి చొరబడ్డ 30 మంది యువకులు
* కేపీహెచ్బి కాలనీలో ఘటన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఇంటి మందు బైక్ లు పార్క్ చేయొద్దని వారించినందుకు దాదాపు 30 మంది యువకులు ఆ ఇంట్లోకి చొరబడి వీరంగం చేశారు. ఈ ఘటన కేపీహెబీ కాలనీలోని రోడ్ నెంబర్ 5 బుధవారం చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 5 లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న యువకులు ప్రతీ రోజూ ఓ ఇంటి ముందు తమ బైక్ లను పార్కింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంటి యజమాని ఆ యువకులను ఇంటి ముందు బండ్లు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందు పడుతున్నామని తమ ఇంటి ముందు బైక్ లను పార్కంగ్ చేయొద్దని అభ్యంతరం తెలిపాడు. ఈ క్రమంలో హాస్టల్ లో ఉంటున్న దాదాపు 30 మంది యువకులు ఆ ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు.ఇంటి సభ్యులతో ఘర్షణకు దిగారు. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఇంటి యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్ని సార్లు వారించినా హాస్టల్ లో ఉంటున్న యువకులు తమ ఇంటి వద్దనే బైక్ లను పార్కింగ్ చేస్తున్నారని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.
…………………………………………..