
బీజేపీ ఎంపీ బండి సంజయ్
* 2026 నాటికి నక్సలిజం ఉండదు
*కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్ హనుమకొండ: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
వేణుగోపాల్ రావు తో పాటు 60 మంది మావోయిస్టులు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు, గృహ మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా 2026 నాటికి దేశంలో నక్సలిజం ఉండదని అన్నారు. దేశంలో అంతర్గత భద్రతపై అమిత్ షా రాజీ లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు సత్పలితాలను ఇస్తున్నాయని అందుకు నిదర్శనమే మల్లోజుల లొంగుబాటు అని బండి అన్నారు. మావోయిస్లులకు కాలం చెల్లిందని ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు
…………………………………..