
* మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు
* సీఎం రేవంత్ రెడ్డికి ఎవరో చాడీలు చెప్పారు
* సుమంత్ వ్యవహారం నాకు తెలియదు
ఆకేరు న్యూస్ హనుమకొండ : దివగంత ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి తరువాత అంతటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై కొండా మురళి స్పందించారు.
ఓ ఎస్డీ సుమంత్ వ్యవహారం తనకు తెలియదన్నారు. హైదరాబాద్ లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. తమ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఏం చెప్తున్నారో తనకు తెలియదని కొండా మురళి అన్నారు. సీఎం రేవంత్ తనను ఎమ్మెల్సీ చేస్తానని హామీ కూడా ఇచ్చారని కొండా చెప్పుకొచ్చారు.
…………………………………………………………………..