
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీలో లొంగు బాట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మావోయిస్ట్ పార్టీ తెలంగాణ నాయకుడు మూడు దశాబ్దాలుగా బండి ప్రకాశ్ మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నాడు. బండి ప్రకాశ్ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వాడు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
————————