
* ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
ఆకేరు న్యూస్, మానకొండూర్ :ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం మానకొండూర్ మండలం నిజాయితీగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకూడదన్నారు. నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి ఇళ్లను రద్దు చేసిన అర్హులైన ఇతరులకు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి తావులేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
పరామర్శఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నిజాయితీగూడెం గ్రామానికి చెందిన సామంతుల శ్రీనివాస్ కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ కరీంనగర్ నుంచి స్వగ్రామం నిజాయతీ గూడానికి బైక్ పై వస్తుండగా, చెంజర్ల వద్ద ఫ్లైవర్ పై ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుంచి ఎగిరి కింద పడటంతో అక్కడికక్కడే మరణించారని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చలించిపోయారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా తోడుంటామని ఎమ్మెల్యే వారికి భరోసనిస్తూ ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కుంబం చిరంజీవి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోళ్ల మురళీధర్, పార్టీ నాయకులు రామిడి తిరుమల్ రెడ్డి, సాయిరి దేవయ్య, కానిగంటి మల్లికార్జున్, గొల్లెన కొమురయ్య, బుర్ర చంద్రాకర్, కనకం కుమార్, గుజ్జ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
……………………………………………………