* కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్య క్రియలు మంగళవారం తెల్లవారుజామున పూర్తయ్యాయి. సోమవారం అర్ధరాత్రి రియాజ్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం రియాజ్ మృత దేహాన్ని పోలీసులు రియాజ్ కుటుంబసభ్యలకు అప్పగించారు. దీంతో రియాజ్ కుటుంబసభ్యులు మంగళవారం తెల్లవారు జామున రియాజ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. పలు దొంగతనాలు,బైక్ ల చోరీ కేసుల్లో పట్టుబడ్డ రియాజ్ను ఈ నెల 17న పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ అస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. పరారీలో ఉన్న రియాజ్ ను పోలీసులు రెండు రోజుల్లో పట్టుకున్నారు. అయితే అప్పటికే గాయాలపాలై ఉన్న రియాజ్ ను చికిత్స నిమిత్తం పోలీసులు జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా
ఆస్పత్రిలో సెక్యూరిటీ కానిస్టేబుల్ గన్ ను లాక్కుని అతడిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే. ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రియాజ్ ఎపిసోడ్ పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.
…………………………………
