ఆకేరు న్యూస్, హనుమకొండ : దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం…దీపావళి పర్వదినం రోజు దీపాల కాంతులతో ఊరంతా దేదీప్య మానంగా వెలిగి పోతుంది. ఈ దీపాలను వెలిగించాలంటే నూనే అవసరం అని అందరికీ తెలిసిన విషయమే కదా.. .కాలం మారింది …అన్ని మారిపోయాయి. నూనెకు బదులుగా నీళ్ళతో ప్రమిదలను వెలిగిస్తున్నారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీళ్ళను వాడడం ఏంటి అనుకుంటున్నారా.. నిజంగా నిజమేనండి .. కావాలంటే మీరు ఈ కింది వీడియోలో చూడండి. నీటి ప్రమిదల వల్ల ఆర్థికంగా ఎంతో ప్రయోజనం అనిపిస్తోంది. గాలి వల్ల దీపాలు ఆరిపోయో పరిస్థితి లేదు . నీటి ద్వారా ఉద్భవించిన అతి తక్కువ స్థాయి విద్యుత్ వల్ల కరెంట్ షాక్ లాంటి ప్రమాదాలు కూడా ఉండవంటున్నారు.అంతేకాదు.. నీటితో వెలిగించిన ప్రమిదల వల్ల అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేదంటున్నారు. ఇన్ని లాభాలున్న నీటితో వెలిగే ప్రమిదలు మీకు కావాలంటే హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయ సమీపంలోకి వెళ్ళాల్సిందే .
========================
