ఆకేరున్యూస్, ములుగు: పోరు కన్నా ఊరు మిన్న అనే సరెండర్ కార్యక్రమానికి ఆకర్షితులై నలుగురు నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ శబరి ఎదుట లొంగిపోయారు. పోయారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు చేపట్టిన పోరుకన్నా ఊరు మిన్న అనే కార్యక్రమానికి ఆకర్షితులై ఇప్పటి వరకు 84 మంది వివిధ వివిధ కేడరులలో పనిచేస్తున్న మావోయిస్టు సభ్యులు, నాయకులు లొంగిపోయారని తెలిపారు .ఇందులో భాగంగానే నలుగురు సభ్యులు ఈ రోజు లొంగి పోయారని వివరించారు .ఇందులో మావోయిస్టు పార్టీ సభ్యులు మడవి కోసి (20), మడవి ఇడుమి (21), మూచిక దేవా (21),ల తో పాటు మిలీషియా కమిటీ సభ్యురాలు మడకం వెండి లోగిపోయారని తెలిపారు . వీరిలో ఒక్కొక్కరికి రూ. 25000 చెక్కును అందజేశారు. వీరి హోదాను అనుసరించి ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ నాయకులు సభ్యులు నక్సలిజాన్ని వదిలి అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు జనజీవన స్రవంతిలో కి రావాలని పిలుపునిచ్చారు . సరెండర్ అయినా వారికి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి చేయూతనందిస్తామని వివరించారు .ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్ తో పాటు సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులున్నారు.
—————————-

…………………………
