* ఛాయ సంస్థ ఆధ్వర్యంలో సాహితీ ఉత్సవం
* అక్టోబర్ 25 న బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో
* వేదికపై సాహితీ దిగ్గజాల సంగమం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సాహితీ కుసుమాలన్నీ ఒకే చాయ కిందకు చేరనున్నాయి. సాహితీ దిగ్గజాలతో హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణం కళకళలాడనుంది. ఈ గొప్ప కార్యక్రమానికి చాయా రిసోర్స్ సెంటర్ శ్రీకారం చుట్టంది.2017లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ సాహితీ వేత్తలను,కవులను కళాకారుల ప్రాత్సాహమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ నేపధ్యంలో కవులను రచయితలను మేధావులతో ఓ మెగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.ఛాయ సాహితీ ఉత్సవం అక్టోబర్ 25, 2025న హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరగనుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7:30 వరకు జరుగుతుంది, ఇందులో గౌతమి చల్లగుళ్ల మరియు మెర్సీ మార్గరెట్ బోడా వంటి పలువురు వక్తలు పాల్గొంటారు. వేర్వేరు పాయల గుండా పయనిస్తున్న తెలుగు సాహితీ సమాజాన్ని ఒక గొడుగు కిందకు చేర్చే ప్రయత్నంగా, తెలుగులో మొట్టమొదటి లిటరేచర్ ఫెస్టివల్‌ను ‘ఛాయ’ సంస్థ నిర్వహించ తలపెట్టింది. రచయితలు, పాఠకులు, అనువాదకులు, విమర్శకులు, ప్రచురణకర్తల మధ్య అర్థవంతమైన సంభాషణల కోసం జరుగుతున్న ఈ సాహిత్యోత్సవం డైరెక్టర్‌గా ప్రముఖ కవి, రచయిత, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది : కే శ్రీనివాస్ , సాహితీ వేత్త, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు
తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది, తెలుగు సాహిత్యాన్ని ఇతర పరిచయం చేసి కొత్త కవులను, యువ
రచయితలను, ప్రోత్సహించడానికి సాహితీ రంగంలో ఉన్న మంచి చెడ్డలను చర్చించుకోవడానికి
సాహితీ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఓ ఉత్సవం అవసరం. ఛాయ ఆధ్వర్యంలో
సాహితీ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో ఒక రోజంతా సామితీ చర్చలు గోష్టులు ఉంటాయి. ఇది మొదటిసారిగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఒకే రోజు ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి రెండు మూడు రోజులునిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. మొత్తం 16 సెషన్స్ లో 50 మంది వక్తలు మాట్లాడుతారు. అంతే కాకుండా 14 పుస్తకావిష్కరణ కార్యక్ర\మాలు ఉంటాయి. రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు 14 ఉంటాయి . దీంట్లో సినిమా సాహిత్యం కార్పొరేట్ రంగం సాహిత్యం, మీడియా సాహిత్యం అనేక అంశాల మీద చర్చలు సమావేశాలు ఉంటాయి
తెలుగు సాహిత్యాన్ని విస్తృతం చేయాలి : కుప్పిలి పద్మ, కవయిత్రి
తెలుగులో మొదటగా సాహిత్యంపై చర్చ జరుగుతోంది.ఇట్లాంటి ఉత్సావాలు ఇతర రాష్ట్రాల్లో చాలా జరిగాయి. మేము అందులో పాల్గొన్నప్పుడు ఇలాంటి ఉత్సవాలు తెలుగులో కూడా జరిగితే
బాగుండు అన్పించింది. ఈ ఆలోచనను చాయ రూపకల్పన చేసింది.దీని వల్ల బెంగాల్ మొదలు కొని అన్ని భాషల సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలకు
పరిచయం చేయాల్సినన అవసరం ఉంది.చాయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాను.
తెలుగులో అన్ని రకాల సాహిత్యం ఉంది : అల్లం నారాయణ : రచయిత, సీనియర్ జర్నలిస్టు
తెలుగులో అన్ని రకాల సాహిత్యం ఉంది,, విప్లవ సాహిత్యం ఉంది.అన్ని రకాల సామాజిక కోణాల మీద కవిత్వం వచ్చింది. నిజానికి చాలా పుస్తకాలను చాయ నే వెలుగులోకి తెచ్చింది.సాహిత్య ఉత్సవం పెట్టడం ద్వారా మన సాహిత్యాన్ని ఇతర భాషలకు ఇతర సాహిత్యాన్ని మనకు పరిచయం చేస్తే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రపంచం అంతా పాల్టొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
కార్యక్రమాల వివరాలు
* 25 న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగు రచయితలతో సాహితీప్రియుల మాటామంతీ
* వివిధ సంస్థలు ముద్రించిన 14 పుస్తకాల ఆవిష్కరణ
* 14 అంశాలపై ప్యానల్ డిస్కషన్ ..డిజిటల్ యుగంలో సాహితీ ప్రయాణం..పిల్లల పుస్తకాల రూపకల్పనలో బొమ్మలు ,ఊహాల ప్రభావం,కార్పొరేట్ జీవితంలో సాహిత్య పాత్ర,తెలుగు సాహిత్యంలో కొత్త కాపు,తెలంగాణ అస్తిత్వం-సాహిత్య ప్రయాణం, సాహిత్యం-సినిమా జమిలి ప్రయాణం, దక్షణాది సహిత్యం తదితర అంశాలు
* సురవరం ప్రతాపరెడ్డి,గుర్రం జాషువా,మఖ్దూం మొహినొద్దిన్,తాడి నాగమ్మలను స్మరించే కార్యక్రమం
* గోరటి వెంకన్న కవితా గానం
ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ 2025లో
పాల్గొనే వక్తలు, ప్యానలిస్టులు మరియు కవులు వీరే..
అబ్దుల్ వాహిద్ ,అక్కిరాజు భట్టిప్రోలు,అల్లం రాజయ్య,అనంతు చింతలపల్లి,అరవింద్ జాషువా,అషర్ ఫర్హాన్,అవినేని భాస్కర్,బి.పి. పడాల,బాలసుధాకర్,బిపిన్ కురియకోసే,బుర్రా సాయి మాధవ్,డాక్టర్ హుమెరా సయీద్,డాక్టర్ ఇందల చంద్రశేఖర్,డాక్టర్ ఎన్. రవికుమార్,డాక్టర్ నీరజ అమరవాడి,డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్,డాక్టర్ ప్రసాదమూర్తి,డాక్టర్ ఎస్. చంద్రయ్య,డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్,డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి,డాక్టర్ వి.ఆర్. రసాని,జి. వెంకట కృష్ణ,గౌతమి చల్లగుళ్ళ,జై ఉందుర్తి,కాత్యాయని
కవనమాలి,కోడూరి విజయకుమార్,కొమ్ము రాజిత,కోయ చంద్రమోహన్,మధురాంతకం నరేంద్ర,మల్లిపురం జగదీష్,ఎండి. మునవర్ అలీ,మెహక్ హైదరాబాది.మెర్సీ మార్గరెట్ బోడా,మొహమ్మద్ ఖదీర్ బాబు
ఎం.వి. రామిరెడ్డి,నరేష్ కుమార్ సూఫీ,పి. నారాయణరెడ్డి,పవిత్ర,పెరుమాళ్ మురుగన్,ప్రొ. చింతకింది ఖాసీం,ప్రొ. మొహమ్మద్ మసూద్ అహ్మద్,ప్రొ. నయీం,ప్రొ. వంగరి త్రివేణి,ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు
సజ్జాద్ షాహిద్,షేక్ జాన్ బషీర్,షహజహానా బేగం,షీలా టామీ,సొలొమన్ విజయ్ కుమార్,స్పూర్తి ,దివనం
శ్రీనివాస్ దించెనాలా,సురేష్ చిత్తూరి,శ్వేత యేర్రం,తాడి ప్రకాష్,వాసుధేంద్ర,వేణు ఉడుగుల,,విద్యా
గోరేటి వెంకన్న (కవిత్వ ప్రదర్శన) ,ఫెస్టివల్ మెంటార్స్,కుప్పిలి పద్మ,ప్రొ. చలపల్లి స్వరూప రాణి
డాక్టర్ కవి యాకూబ్
