* మంత్రి పొన్నం ప్రభాకర్
* సమగ్ర విచారణకు హనుమకొండ కలెక్టర్కు ఆదేశం
ఆకేరు న్యూస్, హనుమకొండ : వంగర గురుకులంలో చోటు చేసుకున్న సంఘన చాలా బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. వసతి గృహంలో చోటు చేసుకున్న సంఘటపై పూర్తి విచారణ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహా శభరీస్ను ఆదేశించారు. కలెక్టర్ చేపట్టిన విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ కు చెందిన వనం తిరుపతి రెడ్డి కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులకు సానుభూమి తెలిపారు. ప్రభుత్వ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
…………………………………………….
